అంచనాలు మించిన కేంద్ర పన్ను వసూళ్లు | Centre’s tax collections up 18% at Rs 17.1 lakh crore, tops target for 2016-17 | Sakshi
Sakshi News home page

అంచనాలు మించిన కేంద్ర పన్ను వసూళ్లు

Apr 4 2017 12:24 PM | Updated on Aug 25 2018 4:14 PM

2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పన్నుల వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ప్రత్యక్ష , పరోక్ష పన్నుల వసూళ్లు అంచనాలు మించి 18శాతం పుంజుకున్నాయి.

న్యూఢిల్లీ: 2016-17  ఆర్థిక సంవత్సరానికి   కేంద్రం  పన్నుల వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ప్రత్యక్ష , పరోక్ష పన్నుల వసూళ్లు  అంచనాలు మించి  18శాతం  పుంజుకున్నాయి.  మొత్తం రూ. 17.10 లక్షల కోట్లు నమోదైనట్టు ఆర్థిక శాఖ మంగళవారం  ప్రకటించింది. గత ఏడాది వసూళ్లతో పోలిస్తే  పన్నుల వసూళ్లు నమోదైనట్టు ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరేళ్లలో ఇంత భారీగా పన్నుల  వసూలు నమోదు కాలేదని   రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ​ అధియా వెల్లడించారు.  

ప్రత్యక్ష పన్నులు 14.2 శాతం పుంజుకుని రూ. 8.47లక్షలుగా ఉన్నాయి.  .పరోక్ష పన్నులు (ఎక్సైజ్, సర్వీస్‌,  కస్టమ్స్‌  పన్నులు)  101.35 శాతంతో రూ. 8.63 లక్షల కోట్లకు చేరింది..  వ్యక్తిగత ఆదాయం పన్ను 18.4 శాతం ఉండగా,  స్థూల రాబడి సేకరణలు పరంగా, కార్పొరేట్ పన్ను పెరుగుదల రేటు 13.1 శాతం ఉంది. అయితే, వాపసు సర్దుబాటు తర్వాత, కార్పొరేట్ పన్నుల వసూళ్లు నికర వృద్ధి 6.7 శాతం ఉండగా,  వ్యక్తిగత  ఐటీ  సేకరణ 21 శాతంగా ఉంది. సేవా పన్ను వసూళ్లు  20.2 శాతం పుంజుకుని  రూ 2.54 లక్షల కోట్లుగా ఉంది.  కస్టమ్స్‌ వసూలు  7.4  శాతం  పెరిగి రూ. రూ 2.26 లక్షల కోట్లుగా నమోదైంది.
కాగా  ఫిబ్రవరి 1 న బడ్జెట్ లో  రూ 16.97 లక్షల కోట్ల పన్ను వసూళ్లను కేంద్ర  ప్రభుత్వం అంచనా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement