ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది.
- అసెంబ్లీ లోపల, బయట డీఎంకే ఆందోళనలు
- స్టాలిన్ సహా పలువురు ఎమ్మెల్యేల అరెస్ట్
చెన్నై: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసింది.
మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలు లేచినిలబడి పన్నీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాకౌట్ చేసిన అనంతరం అసెంబ్లీ బయట కూడా ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్లతో హోరెత్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ను, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీఎం పళనిపై స్టాలిన్ మండిపడ్డారు. అక్రమంగా బలపరీక్షలో నెగ్గిన ప్రభుత్వాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఆందోళన, పోలీస్ అరెస్టులతో అసెంబ్లీ ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.