రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు | Case against Rahul Gandhi for sitting atop moving car in Kerala | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు

Jan 15 2014 9:09 AM | Updated on Sep 2 2017 2:38 AM

రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు

రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ పోలీసులకు ఎన్సీపీ నేత ముజిబ్‌ రెహమాన్‌ ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ పోలీసులకు ఎన్సీపీ నేత ముజిబ్‌ రెహమాన్‌ ఫిర్యాదు చేశారు. కేరళ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ నిన్న పోలీసు వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటు ఊరేగింపుగా వెళ్లారు. ఆ ఘటనపై కేరళ ఎన్సీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలో ఆయన అళప్పుజా జిల్లాలోని నూరానాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 123ని ఉల్లంఘించారని, పోలీసు వాహనాన్ని దుర్వినియోగం చేయడమేకాక ట్రాఫిక్‌ జామ్‌కు కారణమై ప్రజలకు ఇబ్బందులు కలిగించారని ఫిర్యాదు చేశారు.

 

అయితే రాహుల్ గాంధీపై చేసిన ఫిర్యాదును స్వీకరించేందుకు కేరళ పోలీసులు నిరాకరించారు.  రాహుల్ పర్యటన సందర్బంగా ప్రాధమిక అంశాలను పరిశీలించామని, ఆయన భద్రతా నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించలేదని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యువ యాత్రను నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఆయన పోలీస్‌ వాహనం ఎక్కిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement