ఉయ్యాల ఊగుతూ మృత్యు ఒడిలోకి | Boy dies to slip from hammock | Sakshi
Sakshi News home page

ఉయ్యాల ఊగుతూ మృత్యు ఒడిలోకి

Sep 16 2015 10:32 PM | Updated on Sep 3 2017 9:31 AM

ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని ఊపిరాడక బాలుడు మృతిచెందాడు.

సుండుపల్లి(వైఎస్సార్‌జిల్లా): ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకొని ఊపిరాడక బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం కుంటలముంద్ర గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగార్జున్(12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.  

ఈ క్రమంలో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో చీరతో వేసిన ఉయ్యాలలో ఊగుతుండగా.. చీర మెడకు చుట్టుకొని ఊపిరాడక మృతిచెందాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించిన లాభం లేకపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement