ఎన్నికల లాటరీలో అదృష్టలక్ష్మి వరించింది! | BJP candidate Atul Shah wins after lottery in bmc elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల లాటరీలో అదృష్టలక్ష్మి వరించింది!

Feb 23 2017 7:11 PM | Updated on Apr 3 2019 4:53 PM

ఎన్నికల లాటరీలో అదృష్టలక్ష్మి వరించింది! - Sakshi

ఎన్నికల లాటరీలో అదృష్టలక్ష్మి వరించింది!

బీఎంసీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రధానంగా బీజేపీ - శివసేనల మధ్య పలు డివిజన్లలో గెలుపు దోబూచులాడింది.

బీఎంసీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రధానంగా బీజేపీ - శివసేనల మధ్య పలు డివిజన్లలో గెలుపు దోబూచులాడింది. 220వ డివిజన్‌లో కూడా అలాగే జరిగింది. బీజేపీ తరఫున పోటీ చేసిన పార్టీ అధికార ప్రతినిధి అతుల్‌ షా, ఆయన ప్రత్యర్థి.. శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర బాగల్కర్ ఇద్దరికీ ఓట్లు సమానంగా వచ్చాయి. దాంతో రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా కూడా ఓట్లు సమానంగానే వచ్చాయి. 
 
దాంతో మునిసిపల్ కమిషనర్ సమక్షంలో లాటరీ నిర్వహించగా, ఆ లాటరీ బీజేపీ అభ్యర్థి అతుల్ షాను వరించింది. దాంతో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటంలో బీజేపీ అభ్యర్థిని అదృష్టలక్ష్మి వరించినట్లయింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 227 డివిజన్లకు గాను శివసేన 84, బీజేపీ 82 డివిజన్లలో విజయం సాధించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement