సమ్మె బాటలో బ్యాంకర్లు | Bankers to strike next month against anti-labour measures | Sakshi
Sakshi News home page

సమ్మె బాటలో బ్యాంకర్లు

Aug 18 2016 10:52 AM | Updated on Sep 4 2017 9:50 AM

సమ్మె బాటలో బ్యాంకర్లు

సమ్మె బాటలో బ్యాంకర్లు

కేంద్ర ప్రభుత్వ ఎకానమిక్ పాలసీలకు, కార్మిక వ్యతిరేక సంస్కరణలకు వ్యతిరేకంగా బ్యాంకర్లు మళ్లీ సమ్మెకు దిగనున్నారు.

చెన్నై :  కేంద్ర ప్రభుత్వ ఎకానమిక్ పాలసీలకు, కార్మిక వ్యతిరేక సంస్కరణలకు వ్యతిరేకంగా బ్యాంకర్లు మళ్లీ సమ్మెకు దిగనున్నారు. సెప్టెంబర్ 2న దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు బంద్ చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రకటించింది.  కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించిన కేంద్ర కార్మిక యూనియన్ కన్వెన్షన్లో నేషనల్ జనరల్ బంద్కు పిలుపునిచ్చినట్టు ఏఐబీఈఏ ఓ ప్రకటనలో తెలిపింది.

చిన్న బ్యాంకులుగా ఉన్నందున్న విలీనాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థిస్తున్నాయని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీ.హెచ్ వెంకటాచలం అన్నారు. కానీ అది సరియైన పద్ధతి కాదని, మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్స్కు చిన్న బ్యాంకులు ఏర్పాటుచేసుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయని ఆయన చెప్పారు. వర్కర్లకు ట్రేడ్ యూనియన్ హక్కులను ఇవ్వకుండా, కేంద్రప్రభుత్వం చట్టాలను సవరిస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఉద్యోగులు, రీజినల్ రూరల్, కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులూ ఈ బంద్లో పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement