8 మంది పిల్లల్ని చంపిన తల్లి అరెస్టు! | australian mother, who killed 8 children arrested | Sakshi
Sakshi News home page

8 మంది పిల్లల్ని చంపిన తల్లి అరెస్టు!

Dec 20 2014 2:53 PM | Updated on Sep 2 2017 6:29 PM

హత్యాస్థలంలో ఉంచిన టెడ్డీబేర్లు, బొకేలు

హత్యాస్థలంలో ఉంచిన టెడ్డీబేర్లు, బొకేలు

ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ నగరంలో 8 మంది పిల్లలను పొడిచి చంపేసిన తల్లిని పోలీసులు అరెస్టుచేశారు.

ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ నగరంలో 8 మంది పిల్లలను పొడిచి చంపేసిన తల్లిని పోలీసులు అరెస్టుచేశారు. పిల్లలంతా 18 నెలల నుంచి 14 ఏళ్లలోపువారు. వాళ్లను చంపేందుకు ఆమె ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యాస్థలం వద్ద టెడ్డీబేర్లు, పువ్వులు పడి ఉన్నాయి. పిల్లల్లో ఏడుగురు ఆమె కన్న బిడ్డలే కాగా, ఎనిమిదో బిడ్డ ఆమెకు సమీప బంధువు.

నిందితురాలైన 37 ఏళ్ల మహిళను అరెస్టు చేసి, ప్రస్తుతం పోలీసు భద్రతతో కెయిర్న్స్ బేస్ ఆస్పత్రిలో ఉంచినట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బ్రూనో ఆస్నికర్ తెలిపారు. ప్రస్తుతానికి ఆమె మీద తప్ప వేరెవ్వరి మీదా అనుమానాలు లేవని... ఆ ప్రాంతం అంతా సురక్షితంగాగానే ఉందని చెప్పారు. ఈ హత్యలు ఆస్ట్రేలియాను వణికించాయి. ఆ మహిళకున్న మరో కొడుకు (20) ఇంటికి వచ్చినప్పుడు పిల్లల మృతదేహాలు, ఆ పక్కనే టెడ్డీ బేర్లు, పూల బొకేలు కనిపించాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement