ఆక్టాకోర్‌లోకి సెల్‌కాన్ మొబైల్స్ | Ashes into aktakor mobiles | Sakshi
Sakshi News home page

ఆక్టాకోర్‌లోకి సెల్‌కాన్ మొబైల్స్

Jan 15 2015 12:48 AM | Updated on Apr 3 2019 9:17 PM

ఆక్టాకోర్‌లోకి సెల్‌కాన్ మొబైల్స్ - Sakshi

ఆక్టాకోర్‌లోకి సెల్‌కాన్ మొబైల్స్

మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ ఆక్టాకోర్ విభాగంలోకి ప్రవేశించింది.

మిలేనియా ఆక్టా 510 విడుదల
చైనాలో ప్రొడక్ట్ డిజైన్ హౌజ్
అసెంబ్లింగ్ ప్లాంట్ ఈ ఏడాదే
సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ ఆక్టాకోర్ విభాగంలోకి ప్రవేశించింది. మిలేనియా ఆక్టా 510 పేరుతో తొలి మోడల్‌ను సినీ నటి తమన్నా భాటియా చేతుల మీదుగా బుధవారమిక్కడ ఆవిష్కరించింది. హాట్‌నాట్ ఫీచర్‌ను ప్రపంచంలో తొలిసారిగా ఈ మొబైల్‌లో వాడారు. ఈ ఫీచర్ కలిగిన రెండు ఫోన్లను ఎదురెదురుగా ఉంచితే క్షణాల్లో ఫైళ్లన్నీ బదిలీ అవుతాయి. 700 ఎంబీ సినిమాను 15 సెకన్లలో మరో ఫోన్‌లోకి పంపించొచ్చు. ఇంటెల్లిజెంట్ వేక్ అప్ అనే ఫీచర్ ఇందులో ఉంది. లాక్ అయిన స్క్రీన్‌పై ఇంగ్లీషులో ‘సి’ అని రాస్తే కెమెరా, ఎం-మ్యూజిక్, వి-వీ డియో, ‘ఇ’ అని రాస్తే బ్రౌజర్ తెరుచుకుంటుంది. 5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్, ఓజీఎస్ డిస్‌ప్లే, 1.4 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3జీ, కిట్‌క్యాట్ ఓఎస్‌తో ఫోన్ తయారైంది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇతర విశిష్టతలు. ధర రూ.8,999.
 భవిష్యత్ మోడళ్లన్నీ..: ఆధునిక ఫీచర్లతో ఆక్టా 510 రూపొందిందని సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. కంపెనీకి ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. హై ఎండ్ ఫోన్లలో ఉండే స్మార్ట్ గెస్చర్, హ్యాండ్స్ ఫ్రీ సెల్ఫీ, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు ఫోన్‌లో పొందుపరిచారు. భవిష్యత్ మోడళ్లన్నీ హాట్‌నాట్‌తో రానున్నాయని కంపెనీ ఈడీ మురళి రేతినేని మీడియాకు వెల్లడించారు.
 
తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్..

మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ ప్లాంట్‌ను 2015-16లోనే ఏర్పాటు చేస్తామని మురళి చెప్పారు. పన్ను ప్రయోజనాలపై స్పష్టత వచ్చాకే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నెలకొల్పేది ప్రకటిస్తామని అన్నారు. తొలుత నెలకు 1 లక్ష ఫోన్ల అసెంబ్లింగ్ చేపట్టాలన్నది ప్రణాళిక అని వెల్లడించారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి కంపెనీ ప్రణాళిక వెల్లడించామన్నారు. ఐటీ క్లస్టర్ ఒకటి అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రిని కోరామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement