పాప్‌ సంచలనం ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా? | Sakshi
Sakshi News home page

పాప్‌ సంచలనం ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా?

Published Mon, Jun 5 2017 5:12 PM

పాప్‌ సంచలనం ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా?

మాంచెస్టర్‌:  అమెరికన్ సింగర్, పాప్‌ సంచలనం, అరియానా గ్రాండే (23) మాంచెస్టర్‌ మాక్‌ మిల్లర్‌ ల ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందనే పుకార్లు ఇపుడు పాప్‌ వరల్డ్‌ లో షికార్లు చేస్తున్నాయి.  వన్ లవ్ మాంచెస్టర్  కచేరీలో ఆమె  వేలికి రింగ్‌ మెరవడంతో ఈ లవ్‌బర్డ్స్‌ కు  నిశ్చితార్ధం అయిపోయిందనే పుకార్లు వ్యాపించాయి. జూన్ 4 న వన్ లవ్ మాంచెస్టర్ బెనిఫిట్  షోలో, వీరిద్దరు వేదికపై   "ది వే" ,  "డాంగ్" అనే  డ్యూయట్స్‌ను ఆలపించారు. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానం లో నిర్వహించిన ఈ  కచేరీలో ఇతర అనేక పాప్‌ స్టార్లు ప్రేక్షకులను  మంత్రముగ్దులను చేశారు.  అలాగే  గ్రాండే  తాను మిల్లర్‌ తో డేటింగ్‌ చేస్తున్నట్టు గత ఏడాదే ప్రకటించింది.   

ఇది ఇలా ఉంటే  బాధితుల సహాయార్ధం  అరియానా నిర్వహించిన కన్సర్ట్‌  భారీ విజయాన్ని సాధించింది.   కార్యక్రమం ఆద్యంతం అధిక భావోద్వేగాలతో సాగింది.  ముఖ్యంగా యువ అభిమానులతో కలిసి పోలీసు కలిసి ఆడి పాడిన సంఘటనపై సోషల్‌ మీడియా  హోరెత్తింది.  సిటీ  ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ఈ కార్యక్రమంపై ట్విట్టర్‌లో అభినందనల వెల్లువ కురిసింది.   ప్రజలకు ఏకంలో్ చేయడంలో  పాప్ మ్యూజిక్‌ శక్తిని ప్రదిర్శించిందన్న కమెంట్లు వెల్లువెత్తాయి.  అంతేకాదు  ఈ కన్సర్ట్‌  సగటున 10.9 మిలియన్ ప్రేక్షకులు వీక్షించగా,  14.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. అలాగే  ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికులు  వీక్షించిన టీవీ కార్యక్రమంగా నిలిచింది.

కాగా మాంచెస్టర్‌ విషాదంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. మాంచెస్టర్‌ జరిగిన విషాద సంఘటన పట్ల ప్రేమతో స్పందించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసిన అరియానా, ఇలా  సేకరించిన నిధులను బాధిత కుటుంబాలకు అందచేస్తామని ప్రకటించారు. దాదాపు 2 మిలియన్ల డాలర్లను సేకరించాలని లక్ష్యంతో  అరియానా కచేరి నిర్వహించారు. మాంచెస్టర్‌  లోని  మ్యూజిక్‌ కన్సర్ట్‌ లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో   పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. .
 

Advertisement
 
Advertisement
 
Advertisement