మరో రెండు కొత్త ఐఫోన్లు వచ్చేశాయి | Apple launches iPhone 6S, 6S Plus in India | Sakshi
Sakshi News home page

మరో రెండు కొత్త ఐఫోన్లు వచ్చేశాయి

Oct 16 2015 8:49 AM | Updated on Aug 20 2018 2:55 PM

మరో రెండు కొత్త ఐఫోన్లు వచ్చేశాయి - Sakshi

మరో రెండు కొత్త ఐఫోన్లు వచ్చేశాయి

ప్రతిష్టాత్మక సంస్థ యాపిల్ భారత్లో మరో రెండు కొత్త వర్షన్ ఐఫోన్లను ప్రారంభించింది. ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఐఫోన్లను విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సంస్థ యాపిల్ భారత్లో మరో రెండు కొత్త వర్షన్ ఐఫోన్లను ప్రారంభించింది. ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఐఫోన్లను విడుదల చేసింది. నెల రోజుల్లోనే భారత్లో అంతటా ఈ ఫోన్ల లభించనున్నాయి. ఐఫోన్ 6ఎస్ 16 జీబీ వర్షన్ రూ.62,000, 64 జీబీ సపోర్ట్ ఐఫోన్ రూ.72,000కు, 128 జీబీ స్టోరేజి కెపాసిటీ ఫోన్ రూ.82,000కు లభ్యం కానుంది.

ఇక ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16 జీబీ సపోర్ట్తో రూ.72,000, 64 జీబీ వర్షన్ రూ.82,000, 128 జీబీ వర్షన్ రూ.92 వేలల్లో లభించనుంది. క్రోమా, రిలయన్స్ డిజిటల్, జంబోవంటి పెద్దపెద్ద మార్కెట్లతోపాటు ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. మొత్తం 12 వేల రిటెయిల్ షాపుల్లో వీటి అమ్మకాలు జరగనున్నట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఐఫోన్ 6 విడుదలైన విషయం తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement