త్వరలో అంత్యోదయ రైళ్లు ప్రారంభం | Antodaya Express for general passengers to be flagged off soon | Sakshi
Sakshi News home page

త్వరలో అంత్యోదయ రైళ్లు ప్రారంభం

Jan 29 2017 12:14 PM | Updated on Sep 5 2017 2:25 AM

సాధారణ తరగతి ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టనున్న అంత్యోదయ రకం రైళ్లను త్వరలోనే ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ: రైల్వేలో ప్రత్యేకంగా సాధారణ తరగతి ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రవేశపెట్టనున్న అంత్యోదయ రకం రైళ్లను త్వరలోనే ప్రారంభించనున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండే రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తారు.

ఈ రైళ్లలో మంచినీరు, సెల్‌ఫోన్‌ చార్జింగ్, అగ్నిమాపక సాధనాలు, అధునాతన ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌) బోగీలు, జీవ మరుగుదొడ్లు, మరుగుదొడ్డిలో ఎవరైనా ఉన్నారనడానికి సంకేతంగా వెలిగే లైట్లు, కుషన్‌ సీట్లు, ఎల్‌ఈడీ బల్బులు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. రైలు మొత్తం సాధారణ తరగతి బోగీలే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement