విద్యా దినోత్సవం సందర్భంగా ఏఐసీటీఈ లైవ్ లెక్చర్ | AICTE live lecture on the occasion of Education Day | Sakshi
Sakshi News home page

విద్యా దినోత్సవం సందర్భంగా ఏఐసీటీఈ లైవ్ లెక్చర్

Nov 11 2013 4:17 AM | Updated on Jul 11 2019 5:01 PM

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సోమవారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

న్యూఢిల్లీ: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సోమవారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్ మంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ విద్యా రంగానికి చేసిన సేవలపై ఆయన ప్రసంగించనున్నారు. దీనిని ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లోని ప్రీ ఈవెంట్ పీఆర్-ఎడ్యుకేషన్ డేలో అందుబాటులో ఉంచనున్నట్టు మండలి తెలిపింది. ఈ సందర్భంగా కొంతమందికి వివిధ అంశాలపై మంతాతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తామని, ఇందుకోసం వారు ఏఐసీటీఈలో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పింది. లైవ్ లెక్చర్‌ను యూట్యూబ్‌లోనూ చూడవచ్చంది. మౌలానా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement