వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు తమవంతు సాయం చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు.
ముంబై: ఇటీవలి వరదలకు బీహార్ రాష్ట్రం అతలాకుతలమైందని, వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు తమవంతు సాయం చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు. తన తదుపరి సినిమా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ప్రమోషన్ కార్యక్రమంలో నిమగ్నమైన ఆయన సోమవారం ముంబైలో మీడియాతో మాట్లాడారు.
ప్రకృతి వైపరీత్యాలు రాకుండా చూడడం మన చేతుల్లో లేదని.. కానీ తదుపరి పరిస్థితులు మెరుగుపడేందుకు మనవంతు సాయం చేయగలం అని అన్నారు. ప్రభుత్వం కూడాబాధితులను ఆదుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందని, దేశ ప్రజలందరూ బీహార్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమవంతుగా విరాళాలు అందజేయాల్సిందిగా కోరుతున్నానన్నారు.