అక్కడ మనుషులపైకి సింహాలు వదులుతారు! | A zoo where visitors are caged and lions roam free | Sakshi
Sakshi News home page

అక్కడ మనుషులపైకి సింహాలు వదులుతారు!

Feb 12 2015 9:03 PM | Updated on Sep 2 2017 9:12 PM

అక్కడ మనుషులపైకి సింహాలు వదులుతారు!

అక్కడ మనుషులపైకి సింహాలు వదులుతారు!

మృగరాజు సింహం మీద వస్తుంటే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి. కానీ చిలీలో ఓ జంతు ప్రదర్శనశాలలో సింహాలకు ఏకంగా మనుషుల మీదకే వదులుతారు.

మృగరాజు సింహం మీద వస్తుంటే గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయి. కానీ చిలీలో ఓ జంతు ప్రదర్శనశాలలో సింహాలకు ఏకంగా మనుషుల మీదకే వదులుతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా జంతు ప్రదర్శనశాలలో క్రూర మృగాలను బోనుల్లో బందిస్తారు. కానీ చిలీలోని పాక్వీ సఫారీ జూలో సింహాలను స్వేచ్ఛగా వదిలేస్తారు. సందర్శకులను మాత్రం బోనులో పెడతారు.

ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాల్లో సందర్శకులను సింహాల మధ్యకు తీసుకెళతారు. సింహాలను బోనుల్లోంచి దగ్గర చూసే అవకాశం ఇక్కడ కల్పిస్తారు. మృగరాజులు మనుషులపైకి దూకాలన్నా సాధ్యం కాదు కాబట్టి అక్కడే కాసేపు తచ్చాడి నిరాశగా వెనుదిరుగుతాయి.

క్రూరమృగాలకు దగ్గరగా చూడాలనుకునే సాహసికులకు పాక్వీ జూ సరైన స్థలం. సర్కస్ లలో హింసకు గురైన అడవి జంతువులను ఇక్కడవుంచి సంరక్షిస్తున్నారు. సింహాలతో పాటు ఎలుగుబంటులు, కోతులు, ఏనుగు, జిరాఫీలు ఇక్కడ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement