ఎన్నాళ్లో వేచిన పింఛన్... | 85-year-old widow gets husband's retirment benefits after 34 years | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లో వేచిన పింఛన్...

Feb 12 2014 6:11 AM | Updated on Sep 2 2017 3:38 AM

మృతిచెందిన భర్త పింఛన్ కోసం తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన ఫాతిమా బీవీ (85) గడచిన 34 ఏళ్లుగా పడ్డ పడిగాపులు ఎట్టకేలకు ఫలించాయి.

సేలం (తమిళనాడు): మృతిచెందిన భర్త పింఛన్ కోసం తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన ఫాతిమా బీవీ (85) గడచిన 34 ఏళ్లుగా పడ్డ పడిగాపులు ఎట్టకేలకు ఫలించాయి. భర్త మరణంతో లభిం చాల్సిన రూ.6.90 లక్షల మొత్తం మంగళవారం ఆమె చేతికందింది. ఆమె భర్త అబ్దుల్ సుకూర్ సేలం ముని సిపల్ కార్పొరేషన్‌లో ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్‌గా పనిచే స్తూ 1976 మార్చి 25న మరణించాడు. దీంతో అతడికి దక్కాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఫాతిమా అప్పట్లోనే దరఖాస్తు చేసుకుంది. పలుసార్లు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. చివరకు గ్రీవెన్స్ డే సమావేశంలో ఆమె తన గోడు వెళ్లబోసుకోవడంతో సేలం మేయర్ ఎస్.సౌందరప్పన్ ఆమెకు లభించాల్సిన సొమ్ము మొత్తానికి చెక్కును అందజేశారు.

Advertisement

పోల్

Advertisement