పతంజలి ప్రకటనలపై 33 ఫిర్యాదులు | 33 Complaints Received Against Patanjali Advertisements | Sakshi
Sakshi News home page

పతంజలి ప్రకటనలపై 33 ఫిర్యాదులు

Aug 2 2016 6:02 PM | Updated on Mar 28 2019 6:26 PM

యోగా గురు రామ్ దేవ్ పతంజలి ఉత్పత్తుల ప్రకటనలపై 30 ఫిర్యాదులు అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి మంత్రి రాజవర్దన్ రాథోడ్ లోక్ సభకు తెలిపారు.

న్యూఢిల్లీ: యోగా గురు రామ్ దేవ్ పతంజలి  ఉత్పత్తుల ప్రకటనలపై  30  ఫిర్యాదులు  అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి  మంత్రి రాజవర్దన్ రాథోడ్  లోక్ సభకు తెలిపారు.   పతంజలి ఆయుర్వేదం లిమిటెడ్ ప్రకటనలకు  వ్యతిరేకంగా ఏప్రిల్ 2015 , జూలై 2016 మధ్య కాలానికి  30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని పార్లమెంట్ కు ఇచ్చిన  లిఖిత పూర్వక సమాధానంలో  తెలియజేసారు. దీంతో మొత్తం ఈ సంవత్సరానికి 33 కంప్లయిట్స్ నమోదయ్యాయన్నారు.

కన్జూమర్ ఫిర్యాదుల కౌన్సిల్ (సీసీసీ) పరిశోధనలను ప్రకారం ప్రకటనల స్వీయ నియంత్రణపై ఈ ఫిర్యాదులందాయన్నారు.   వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 21  ఫిర్యాదుల్లో , 17 అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  నిబంధనలు ఉల్లంఘించినట్టుగా  పరిగణించినట్టు  చెప్పారు. ఆరు  ఉత్పత్తి ప్యాకేజింగ్ సమాచార ప్రకటనలు కూడా,   అడ్వర్టైజింగ్ కంటెంట్ స్వీయ నియంత్రణ కోల్పోయినట్టుగా గుర్తించామనీ, ఏఎస్సీఐ కోడ్ ఉల్లంఘనగానే  భావించినట్టు మంత్రి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement