లోయలో పడిన బస్సు : 17 మంది మృతి | 17 killed, 21 injured as bus falls into gorge in Himachal | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు : 17 మంది మృతి

May 7 2014 2:34 PM | Updated on Sep 2 2017 7:03 AM

హిమాచల్ప్రదేశ్ సిమౌర్ జిల్లా మైలా గ్రామ సమీపంలో బుధవారం బస్సు లోయలో పడింది.

హిమాచల్ప్రదేశ్ సిమౌర్ జిల్లా మైలా గ్రామ సమీపంలో బుధవారం బస్సు లోయలో పడింది. ఆ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులు మరణించగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ సుమేథా వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని పొనాట సాహిబ్ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించామని తెలిపారు. అనంతరం వారని మెరుగైన వైద్య చికిత్స కోసం షిల్లై ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

 

అయితే క్షతగాత్రులలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని... చంఢీగఢ్లోని పీజీఐ ఆసుపత్రికి వారిని తరలించాలని వైద్యులు సూచించారని, ఈ నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా.... ఇంకో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. బస్సు మిలా నుంచి పనోటా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎస్పీ సుమేధా వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement