చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం: వృద్ధురాలికి గాయాలు | Youth tries to snatch chain | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం: వృద్ధురాలికి గాయాలు

Nov 3 2015 6:32 PM | Updated on Sep 3 2017 11:57 AM

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం పట్టపగలు ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు విఫలయత్నం చేశాడు.

రామాయంపేట (మెదక్) : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం పట్టపగలు ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వృద్ధురాలు కింద పడి గాయాలపాలైంది. బాధితురాలి కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం రామేశన్‌పల్లి గ్రామానికి చెందిన ముచ్చెర్ల మోహన్‌రెడ్డి తన తల్లి పద్మవ్వతో కలిసి మంగళవారం బైక్‌పై రామాయంపేట మీదుగా నిజాంపేటలోని తమ బంధువుల వద్దకు వెళ్తున్నారు.

అయితే రామాయంపేట ఎల్లమ్మగుడి కమాన్ వద్ద ముఖానికి గుడ్డకట్టుకున్న ఓ యువకుడు వెనుక నుంచి బైక్‌పై వచ్చి పద్మవ్వ మెడలోని పుస్తెలతాడు లాగాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆగంతకుడు క్షణాల్లో బైక్‌పై పారిపోయాడు. పద్మవ్వను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement