రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | young man died in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Jan 13 2015 4:15 AM | Updated on Aug 30 2018 3:58 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన తుర్కపల్లిలో సోమవారం చోటు చేసుకుంది.

తుర్కపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన తుర్కపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మండల కేంద్రానికి చెందిన కోట కిరణ్(23) రోజూ వారీగా  వ్యవసాయ బావి వద్ద గడ్డి తీసుకువచ్చేందుకు తన స్కూటర్‌పై బయలుదేరాడు. యాదగిరిగుట్ట రోడ్డు వద్ద ప్రధాన చౌరస్తా దాటుతుండగా జగదేవ్‌పూర్ నుంచి భువ నగిరి వైపు వెళుతున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది.  వాహనం డీసీఎం వె నక టైర్లు కిరణ్ చాతీ మీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటర్ ప్రమాదంలో నుజ్జు నుజ్జైంది. కిరణ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.  మృతుడికి ఇద్దరు తమ్ములు,తల్లి,దండ్రి ఉన్నారు. విషయం తెలుసుకుని ఎస్‌ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీసీఎంను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదే హాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement