10 నుంచి యాదాద్రి బహ్మోత్సవాలు | yadadri brahmotswalu from march 10th | Sakshi
Sakshi News home page

10 నుంచి యాదాద్రి బహ్మోత్సవాలు

Mar 7 2016 7:35 PM | Updated on Nov 6 2018 5:47 PM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత తెలిపారు.

కాచిగూడ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... 12వ తేదీ నుంచి 19 వరకు ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు జరుగుతాయన్నారు.

16వ తేదీన రాత్రి 9.45 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 17న రాత్రి 9.45 గంటలకు తిరు కళ్యాణం, 18వ తేదీన రాత్రి 9 గంటలకు స్వామి వారి దివ్య విమాన రథోత్సవం ఉంటాయన్నారు. 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజూ స్వామి అలంకార, వాహన సేవలు జరుగుతాయని... స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తులు (దంపతులు మాత్రమే) రూ.10,116 చెల్లించి పాల్గొనవచ్చునని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement