ప్రజలకు అందుబాటులో ఉంటా.. | Will be available to the public | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో ఉంటా..

May 20 2014 2:51 AM | Updated on Aug 29 2018 8:56 PM

ప్రజలకు అందుబాటులో ఉంటా.. - Sakshi

ప్రజలకు అందుబాటులో ఉంటా..

తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.

 జనగామ, న్యూస్‌లైన్ : తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తదుపరి సోమవా రం ఆయన తొలిసారి జనగామకు వచ్చా రు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ అభిమానాన్ని ఉద్యమం రూపంలో చూపిన ప్రజలు ఇప్పుడు ఓటు రూపంలో చూపి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు.
 
 గెలుపు ఆనందం కన్నా హామీల బాధ్యతలు ఎక్కువయ్యాయని, వాటిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పా రు. కేబినెట్ ప్రారంభమైన వారం రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండా యాదగిరిరెడ్డి, నాయకులు కన్నా పరుశరాములు, రంగారెడ్డి, చేవెల్ల సంపత్, పసుల ఏబెల్, తిప్పారపు ఆనంద్, ఆలూరి రమేష్, ఆకునూరి వెంకన్న, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement