మహిళల భద్రత కోసం చర్యలు: డీజీపీ | We are taking care for Women protection: DGP Anurag Sharma | Sakshi
Sakshi News home page

మహిళల భద్రత కోసం చర్యలు: డీజీపీ

Sep 19 2014 1:29 AM | Updated on Mar 28 2018 11:05 AM

మహిళల భద్రత కోసం చర్యలు: డీజీపీ - Sakshi

మహిళల భద్రత కోసం చర్యలు: డీజీపీ

రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని

సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చే స్తున్నామని గురువారం తనను కలసిన మహిళా భద్రతా కమిటీ ప్రతినిధులకు డీజీపీ అనురాగ్‌శర్మ వివరించారు.పూనమ్ మాలకొండయ్య ఇటీవల మహిళల భద్రత విషయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని డీజీపీకి అందించారు. దీనిపై స్పందించిన  డీజీపీ  పోలీసు శాఖ తరపున చేపట్టిన చర్యలు ప్రభుత్వానికి చేయనున్న సిఫార్సుల గురించి వారికి వివరించారు. 
 
పోలీసుస్టేషన్ లేదా పోలీసు సబ్‌డివిజన్ స్థాయిలో ఒక మహిళా కౌన్సిలర్‌ను కూడా నియమించాలని నిర్ణయించామన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని  కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు.ప్రతి పోలీసుస్టేషన్‌లో ఒక లీగల్ అడ్వైజర్‌ను కూడా నియమించి, పోలీసు దర్యాప్తు అధికారులు,కోర్టుల మధ్య సమన్వయాన్ని పెంచుతామన్నారు.డీజీపీతో సమావేశమైన మహిళా భద్రతా కమిటీ సభ్యులలో ఐఏఎస్ అధికారులు సునీల్‌శర్మ, శైలజఅయ్యంగార్, ఐపీఎస్ అధికారులు డాక్టర్‌సౌమ్యమిశ్రా, స్వాతిలక్రా, చారుసిన్హాలున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement