జిల్లాలో 9 మున్సిపల్‌లు టీఆర్‌ఎస్‌ కైవసం!

Warangal Municipal Chairmans And Vice Chairmans Details - Sakshi

సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు.

9 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్‌ల వారి వివరాలు.

 • వరంగల్ రూరల్ జిల్లా: పరకాల మున్సిపల్ చైర్మన్‌గా సోదా అనిత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా రేగురి జైపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు.
 • వరంగల్ రూరల్ జిల్లా: వర్ధన్నపేట నూతన మున్సిపాలిటి ఛైర్ పర్సన్ అంగోత్ అరుణ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
 • వరంగల్ రూరల్ జిల్లా:  నర్సంపేట మున్సిపల్  చైర్మన్‌గా గుంటి రజని కిషన్ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నికయ్యారు.
 • మహబూబాద్ మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఎన్నికగా, వైస్ చైర్మన్ గా మహ్మద్ ఫరిద్ ఎన్నికయ్యారు.
 • మహబూబాద్ జిల్లా: మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూర, వైస్ చైర్మన్ గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నికయ్యారు. 
 • మహబూబాద్ జిల్లా: డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్‌గా వంకుడొతు వీరన్న ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కేసబోయిన కోటి లింగం ఎన్నికయ్యారు. 
 • మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్‌గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 
 • భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్‌గా  సెగం వెంకట రాణి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కొత్త హరిబాబు ఎన్నికయ్యారు.
 • జనగామ జిల్లా:జనగామ మున్సిపాలిటీ  చైర్మ్‌న్‌గా పోకల జమున ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా మేకల రాం ప్రసాద్ ఎన్నికయ్యారు

  జనగామ మున్సిపల్ చైర్మన్‌ జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్‌లను అభినందిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top