రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులు కోరకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులు కోరకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సమగ్రసర్వేలో నమోదైన బీసీ జనాభాను కులాలవారీగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
కులాల వారీగా జనాభా వివరాలను వెల్లడించాలని, అందుకు అనుగుణంగా అవకాశాలను కల్పించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు, బీసీ కమిషన్‌కు లేఖ రాసినట్టుగా తెలిపారు.