మంత్రి హరీశ్‌కు మిషిగన్ వర్సిటీ ఆహ్వానం | University of Michigan invitation of the Minister of harisrao | Sakshi
Sakshi News home page

మంత్రి హరీశ్‌కు మిషిగన్ వర్సిటీ ఆహ్వానం

Jan 30 2015 6:46 AM | Updated on Sep 2 2017 8:32 PM

మిషన్ కాకతీయ-చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తమ విశ్వవిద్యాలయానికి...

  • ‘మిషన్ కాకతీయ’పై ప్రసంగించాలని విజ్ఞప్తి
  • సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ-చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు తమ విశ్వవిద్యాలయానికి రావాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విభాగం మంత్రికి లేఖను పంపింది.

    ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన మిషిగన్ వర్సిటీ విద్యార్థి బృందం తెలంగాణలో పరిశోధన చేస్తోంది. ఆగస్టులో వివిధ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం తమ ప్రాథమిక అధ్యయన నివేదికను వర్సిటీకి సమర్పించింది. నివేదికను ఆమోదించిన వర్సిటీ అధికారులు దీనిపై విస్తృత పరిశోధనకు 50 వేల డాలర్లను (సుమారు రూ. 30 లక్షలు) కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement