‘ఐటీ గ్రిడ్స్‌’కు డేటా ఇచ్చిందెవరు? 

UIDAI Suspects AP Government Involvement In Data Breach Case - Sakshi

ఏపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉండొచ్చని యూఐడీఏఐ సందేహం

ప్రలోభాలు లేదా ఒత్తిళ్లతో కొందరు అధికారులు లీక్‌ చేసి ఉండొచ్చని అంచనా

అదే నిజమైతే తొలి వేటు పడేది వారిపైనే...

సాక్షి, హైదరాబాద్‌: ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7 కోట్ల మంది పౌరుల ఆధార్‌ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్‌ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్‌ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సీఐడీఆర్‌), స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డీహెచ్‌) వద్ద భద్రంగా ఉం డాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది. ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం ఉండొ చ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. 

తొలుత వేటు పడేది అధికారులపైనే.. 
ఈ కేసులో ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలోని సిట్‌ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40కిపైగా హార్డ్‌ డిస్కులను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం జరిగిందని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇవ్వడంతో సిట్‌ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్‌లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్‌ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top