సాగర్‌ హైవేపై ప్రమాదం: ఇద్దరి మృతి | Two Killed in Sagar Highway Accident | Sakshi
Sakshi News home page

సాగర్‌ హైవేపై కారు, ఆటో ఢీ 

Jul 19 2019 10:30 AM | Updated on Jul 19 2019 10:31 AM

Two Killed in Sagar Highway Accident - Sakshi

ఘటనా స్థలంలో పడి ఉన్న చందర్, నర్సింగ్‌

యాచారం: నాగార్జునసాగర్‌ – హైదరాబాద్‌ రహదారిపై కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో తల్లీకొడుకులు మృతిచెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం లైలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కాట్రోత్‌తండాకు చెందిన చందర్‌ ఆయన భార్య నేజీ(45), కుమారుడు నర్సింగ్‌(26) తమ ఆటోలో ఇబ్రహీంపట్నం నుంచి మాల్‌ వైపు వెళ్తున్నారు. యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తూ గునుగల్‌ క్రీడాక్షేత్రం సమీపంలో ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న చందర్, నేజీ, నర్సింగ్‌లకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న నేజీ, ఆమె కొడుకు నర్సింగ్‌ చికిత్స పొందుతూ మృతిచెందారు. చందర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుకుమార్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement