పెళ్లి లారీ బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
మరో 32 మందికి గాయాలు
చింతపల్లి: పెళ్లి లారీ బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. బుధవారం ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. తక్కెళ్లపల్లి పంచాయతీ పరిధిలోని రోటిగడ్డ తండాకు చెందిన ఇస్లావత్ నరేష్‌కు నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి తండాకు చెందిన అనుజతో బుధవారం ముష్టిపల్లిలో పెళ్లి జరగనుంది.
ఆ వేడుకకు వెళ్లేందుకు పెళ్లికుమారుడి బంధువులు తక్కెళ్లపల్లి నుంచి లారీలో బయలుదేరారు. వేగంతో వెళ్తున్న లారీ.. గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తాకొట్టడంతో అందులో ఉన్న నేనావత్ బాష (62), నేనావత్ చావిలి (65) అక్కడికక్కడే మృతిచెందగా మరో 32 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.