బైక్ బోల్తాపడి ఇద్దరు మృతి | Two killed in collapsed in the bike | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తాపడి ఇద్దరు మృతి

Feb 7 2016 8:48 PM | Updated on Sep 2 2018 3:51 PM

బైక్ బోల్తాపడి ఇద్దరు మృతి - Sakshi

బైక్ బోల్తాపడి ఇద్దరు మృతి

అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.


 చివ్వెంల : అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి బో ల్తా కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందా రు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథ నం ప్రకారం... ఖమ్మం జిల్లా ముదిగొండ మం డలం పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన గరిపాకుల సత్యం (40), సూర రాము(26) శుక్రవారం రాత్రి బైక్‌పై ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రా మ శివారులో బైక్ అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న సత్యం ఎగిరి చెట్లపొదల్లో పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

గాయాలతో రోడ్డుపై పడి ఉ న్న రామును స్థానికులు గమనించి పోలీసులకు స మాచారం అందించారు. ఎస్సై ఎ.శ్రీనివాస్ సిబ్బం దితో సంఘటనా స్థలానికి చేరుకుని రామును 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా వైద్యశాలకు తరలించిన అనంతరం మృతి చెందాడు. సత్యానికి భార్య, పిల్లలు ఉండగా, రాము అవివాహితుడు. అదే వైద్యశాలలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రాము సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement