పూల కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయారు... | Two Died Who Went For Flowers | Sakshi
Sakshi News home page

పూల కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయారు...

Nov 25 2015 4:04 PM | Updated on Sep 3 2017 1:01 PM

పూల కోసం చెరువులో దిగిన అక్కా తమ్ముళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు.

పూల కోసం చెరువులో దిగిన అక్కా తమ్ముళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కా తమ్ముళ్లు నాగమణి(8), సిద్ధు(5) ఈ రోజు గ్రామ సమీపంలోని ఊర చెరువులో ఉండే అల్లి పూల(తామర పూల వంటివి) కోసం చెరువులోకి దిగారు. చిన్నారులకు ఈత రాకపోవడంతో.. ప్రమాదవశాత్తూ నీట మునిగిగారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే వారు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


 

Advertisement
 
Advertisement
Advertisement