ఆర్థిక ఇబ్బందులతో ఒకరు, మానసిక అనారోగ్యంతో మరొకరు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోబోయారు.
రామ్‌గోపాల్‌పేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులతో ఒకరు, మానసిక అనారోగ్యంతో మరొకరు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోబోయారు. లేక్ పోలీసులు వీరిని రక్షించారు. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ తులసీరామ్ నాయక్ (35) ఆర్థిక సమస్యలతో విసిగిపోయి శుక్రవారం సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద సాగర్‌లో దూకబోతుండగా స్థానికుల అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పార్సీగుట్ట ప్రాంతానికి చెందిన సందీప్ (23) ఎన్టీఆర్ గార్డెన్ వద్ద సాగర్‌లో దూకగా.. పోలీసులు రక్షించారు. మానసిక అనారోగ్యంతో ఉన్న సందీప్.. ఎర్రగడ్డ మానసిక వైద్య శాలలో ఇచ్చే చికిత్సకు భయపడి ఆత్మహత్యాయత్నం చేసినట్టు విచారణలో వెల్లడైంది.