వికార్ ఎన్ కౌంటర్‌పై విచారణ | TS Govt agrees for Alair encounter probe | Sakshi
Sakshi News home page

వికార్ ఎన్ కౌంటర్‌పై విచారణ

Apr 13 2015 1:59 AM | Updated on Sep 3 2017 12:13 AM

వికార్ ఎన్ కౌంటర్‌పై విచారణ

వికార్ ఎన్ కౌంటర్‌పై విచారణ

నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్‌పై విచారణ సాగుతోందని..

సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్‌పై విచారణ సాగుతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విచారణలో పోలీసుల తప్పు ఉందని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌పై  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు సీఎం కేసీఆర్‌కు, తనకు విజ్ఞాపనలు అందజేశారన్నారు.  

హోంమంత్రిని బర్తరఫ్ చేస్తారని ఆదివారం జరిగిన ప్రచారాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనేది సీఎం విచక్షణాధికార మని నాయిని అన్నారు. మార్పుపై సీఎంకు సర్వాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
 
20న అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు
టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 20న పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరిస్తామని మంత్రి నాయిని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఆయనను పార్టీ అధినేత కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల  దాకా నామినేషన్ల స్వీకరణ, 21న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు.

ఉపసంహరణల అనంతరం ఎవరైనా పోటీలో ఉంటే 24న ఎల్బీస్టేడియంలో జరిగే పార్టీ ప్లీనరీలో ఎన్నిక జరుపుతారు. ఆరోజు హాజరయ్యే 36 వేల మంది ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. ఒకవేళ ఉపసంహరణల తర్వాత బరిలో ఒక్కరే ఉంటే అదే రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తామని నాయిని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement