సోనియాకు కృతజ్ఞతలు చెప్పాలి: జానారెడ్డి | TRS Govt say to thanks to sonia, says K.Jana Reddy | Sakshi
Sakshi News home page

సోనియాకు కృతజ్ఞతలు చెప్పాలి: జానారెడ్డి

Nov 7 2014 2:01 PM | Updated on Oct 22 2018 9:16 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారని ఆ రాష్ట్ర పార్టీ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారని ఆ రాష్ట్ర పార్టీ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సోనియాకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కె.జానారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని... ఆ దిశగా అడుగులు వేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement