
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కోదండరామ్
మల్లన్నసాగర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు.
మెదక్: మల్లన్నసాగర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఇరిగేషన్, రెవెన్యు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పోలీసుల పహారా పెట్టొద్దని, తక్షణమే పోలీస్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోదండరామ్ సూచించారు.
అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆయన కోరారు. కాగా మల్లన్నసాగర్ ముంపు బాధితులను పరామర్శించేందుకు గజ్వేల్ వస్తున్న కోదండరామ్ బృందాన్ని మెదక్ జిల్లా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించటంతో కోదండరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.