అభివృద్ధిని చూసే పార్టీలోకి.. | Trs Development in Party Join Peoples | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని చూసే పార్టీలోకి..

Apr 6 2018 10:34 AM | Updated on Apr 6 2018 10:34 AM

Trs Development in Party Join Peoples - Sakshi

పార్టీలో చేరినవారితో ఎమ్మెల్యే లక్ష్మి

ఆసిఫాబాద్‌క్రైం : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే తమ పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వాంకిడి మండలంలోని కనర్గాం గ్రామానికి చెందిన ప్రజలను ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు మెచ్చి పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వాపోయారు. గ్రంథాలయ చైర్మన్‌ కనక యాదవ్‌రావు, రెబ్బన ఎంపీపీ సంజీవ్, ఎంపీటీసీ రవీందర్, నాయకులు గాదవేణి మల్లేశ్, సుదర్శన్‌గౌడ్, జాడి రేణుక బాయి, రాజు బాయి, నందు, కిరణ్, జీవన్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement