పెద్దపల్లి: మాట నిలబెట్టుకున్నా.. దాసరి మనోహర్‌ రెడ్డి

TRS Candidate Dasari Manohar Reddy Interview With Sakshi

మళ్లీ గెలిస్తే అభివృద్ధిని రెట్టింపు చేస్తా 

జిల్లా కేంద్రానికి ప్రత్యేక గౌరవం తెస్తా

పనిచేసిన ప్రతినిధిగా మళ్లీ ఓట్లు అడుగుతున్నా

’సాక్షి’తో పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి ప్రజలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్న. రైతు బిడ్డగా రైతులకు కావాల్సిన చెరువులు, కుంటలు మరమ్మతు చేయించి రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన. రికార్డు స్థాయిలో మిషన్‌కాకతీయ పనులు జరిగాయి. పనులు చేశాను కాబట్టే మళ్లీ రెండోసారి ఓట్లు అడుగుతున్న. ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధిని చెట్టింపు చేస్తా.’ అని టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు కోరుతున్న దాసరి  ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనపై అనేక విషయాలను వివరించారు.              
   

సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో నా వంతు పాత్రను గుర్తించిన ఓటర్లు 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. అందుకు కృతజ్ఞతగా పెద్దపల్లి నియోజకవర్గానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాను. రైతులకు అవసరమైన సాగునీటి వనరులను అభివృద్ధి చేశాను. మానేరు వాగుపై మూడు చోట్ల చెక్‌డ్యాం నిర్మించడం ద్వారా మానేరు నుంచి రైతులు పంటలకు నీళ్లు తీసుకుంటున్నారు. హుస్సేన్‌మీయా వాగుపై నాలుగు చోట్ల చెక్‌డ్యాంల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధులు మంజూరు చేయించాను. పెద్దపల్లిపట్టణంలో ఎన్నోఏళ్లుగా ఇక్కడి ప్రజలు కలగంటున్న మినీ ట్యాంకు బండ్‌ నిర్మాణం వెనుక నా శ్రమని స్థానికులు గుర్తించారు. ప్రత్యేకించి నిబంధనల కంటే అదనంగా పనులు చేయించాను. మినీ ట్యాంకు బండ్‌ నిర్మాణంలో అవంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు చేయించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బొంపెల్లి తాగునీటి ఫిల్టర్‌ ప్రాజెక్టును పూర్తిచేయించి వాటి ద్వారా పెద్దపల్లి ప్రజలకు దాహర్తి  తీర్చగలిగాను.

గోదావరి జలలాను పెద్దపల్లి ప్రజలకు అందించాను. జిల్లా హోదా దక్కిన పెద్దపల్లిని తెలంగాణ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే కలెక్టరేట్‌ భవన నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రెండు, మూడునెలల్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. ప్రభుత్వం రైతులకు  రైతుబంధు స్కీం ద్వారా నియోజకవర్గంలో 62 వేల మందికి ప్రయోజనం కలిగింది. అలాగే 15 వేల మంది గొర్రెల కాపారుల కుటుంబాలకు  ప్రయోజనం చే కూర్చాను. కల్యాణలక్ష్మి, షాదీముబరాక్‌ పథకాల ద్వారా 4,500 మంది ఆడబిడ్డల పెళ్లిల్లకు లబ్ధి చేకూర్చాను. నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, చికిత్స చేయించుకున్నవారికి రూ.10 కోట్లు మంజూరు చేయించాను. వివిధ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2,300 కోట్లు వెచ్చించాను. గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేలతో పోలిస్తే తన పాలన సమయంలో 20 రెట్లు అభివృద్ధి చేశాను.

ముఖ్యమంత్రితో అవార్డు మర్చిపోలేనిది..
పెద్దపల్లి నియోజకవర్గంలో పండ్ల మొక్కల నాటి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నుంచి ప్రసంశలు అందుకోవడం మర్చిచిపోలేనిది. సాక్షాత్తు అసెంబ్లీ సమయంలో  ముఖ్యమంత్రి తనకు హరితమిత్ర అవార్డును అందిస్తూ అభినందించిన తీరు గుర్తుండి పోయింది. పలు సందర్భాల్లో హరితహారం గురించి ప్రస్తావన వేళ తనను మంత్రి మండలి సైతం ఆదర్శంగా తీసుకోవడం వెనుక పెద్దపల్లి ప్రజల సహకారం ఉంది. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాల్సిందిగా కోరాను. తిరిగి రెండోసారి అధికారం అప్పగిస్తే గతం నేర్పిన అనుభవాలు పెద్దపల్లి అభివృద్ధికి తోడ్పాడుతాయని నమ్ముతూ ప్రజల ఆశీర్వాదం కోరుతున్న. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top