అటవీ సిబ్బందిపై గిరిజనుల దాడి | tribles attack on forest officers in aswarao pet | Sakshi
Sakshi News home page

అటవీ సిబ్బందిపై గిరిజనుల దాడి

Jun 16 2015 3:16 PM | Updated on Sep 26 2018 5:59 PM

అటవీ సిబ్బందిపై గిరిజనుల దాడి - Sakshi

అటవీ సిబ్బందిపై గిరిజనుల దాడి

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలో గిరిజనులు అటవీశాఖ అధికారులపై దాడి చేశారు.

అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలో గిరిజనులు అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. మండల పరిధిలోని బండారుగుంపు వద్ద అటవీ భూముల్లో గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు జగన్నాథపురం సెక్షన్‌కు చెందిన అటవీశాఖ సిబ్బంది వాహనంలో వెళ్లగా... వారిని పోడు సాగుదారులు అడ్డుకున్నారు. దాడికి దిగడంతోపాటు జీపును ధ్వంసం చేశారు. దీంతో అటవీశాఖ సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement