
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తగ్గట్లు రహదారులు పెరగకపోవడం, చాలాచోట్ల రోడ్లపై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడంతో నగరవాసికి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది.
ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలపై అధ్యయనం కోసం ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు బెంగళూరుకు పంపనున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ మంచి ఫలితాలిస్తూ ట్రాఫిక్ పోలీసులకు వరంగా మారిన ‘బీ–ట్రాక్’ (బెంగళూరు ట్రాఫిక్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్)ను సిటీలో అమలు చేస్తే ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఈ క్రమంలో నగరంలోని రద్దీ ప్రాంతాలపై ఓ లుక్కేద్దామా..