నవీపేట మేకల సంతలో కోట్లల్లో క్రయవిక్రయాలు

Trading in Crores in Navipet Goats Market - Sakshi

ఊర పండగ, వన భోజనాల ఎఫెక్ట్‌

నవీపేట(బోధన్‌): మండల కేంద్రంలో శనివారం జరిగిన వారాంతపు మేకల సంతలో క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. రూ.కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. జిల్లాకేంద్రంలో ఆదివారం జరుగనున్న ఊర పండగ సంబరాలతో పాటు వన  భోజనాల సందడితో మేకల సంతలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఊర పండగకు ఆనవాయితీగా అమ్మవారికి మేకలను బలిఇవ్వడంతో అమ్మవారి భక్తులు మేకల కొనుగోళ్లు జరిపారు. గ్రామాలలో వన(విందు) భోజనాలకు మాంసాహారాన్ని భుజించడంతో మేకలకు మరింత గిరాకీ పెరిగింది. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన కొనుగోలుదారులు అధిక ధరలు చూసి వాపోయారు. మనుపటికంటే అధిక ధరలకు విక్రయించడంతో విస్తుపోయారు. అవసరం నిమిత్తం కొనుగోలు చేయక తప్పలేదు. సీజన్‌ను గమనించిన మహారాష్ట్రలోని ధర్మాబాద్, పర్బణి, ముత్ఖేడ్, జాల్నాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలోని వ్యాపారులు ఒకరోజు ముందుగానే నవీపేటకు వచ్చి విక్రయాలు జరిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top