బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు

Lookout Notices On Son Of Bodhan EX MLA - Sakshi

బోధన్: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహైల్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి  సోహైల్‌ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ని లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కి పంపించాడని పోలీసులు తెలిపారు.

ప్రమాదం చేసిన సోహెల్ నేరుగా ముంబకి వెళ్లిపోయాడు. అటునుంచి దుబాయ్ కి పారిపోయాడు. సోహెల్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కాగా షకీల్‌ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్‌ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్‌ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్‌ సీపీ విచారణకు ఆదేశించారు. 

ష​కీల్‌ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసింది షకీల్‌ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్‌ ఎవరు? పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top