రామలింగేశ్వరునికి కార్తీక శోభ

From Today Onwards Karthika Pournami Fairs In Sri Ramalingeswara Swamy Temple - Sakshi

నేటి నుంచి ఉత్సవాలు

23న లక్ష దీపోత్సవం 

హాజరుకానున్న ఎంపీ కవిత, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ

మల్లాపూర్‌(కోరుట్ల): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక హరిహరక్షేత్రంగా శ్రీరామలింగేశ్వర ఆలయం కీర్తించబడుతుంది. మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న ఆలయంలో కార్తీక మాస పంచాహ్నిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి 23న కార్తీక పౌర్ణమి వరకు శివముష్టి, చందనోత్సవ, తులసీ వివాహా, అష్టోత్తర కళశ స్నపన, లక్ష కుంకుమార్చన, పుష్పయాగములతో పాటు..పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. లక్ష దీపాలంకరణోత్సవాలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తుల ఉమ పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్‌ సాంబారి శంకర్, వైస్‌ చైర్మన్‌ చిలివేరి లక్ష్మి, ఎంపీటీసీ ఇస్లావత్‌ లక్ష్మీబలరాంనాయక్, మాజీ సర్పంచులు చిలివేరి రమేశ్, ఎండీ.జమాల్, మాజీ ఉపసర్పంచ్‌ దండిగ రాజం తెలిపారు.

విచ్చేయనున్న సాధుపుంగవులు..
కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి సాధుపుంగవులు ముఖ్య ఆథితులుగా విచ్చేయనున్నారు. మనోరబాద్‌ నుంచి శ్రీ శివానందభారతిస్వామి, శకణాగిరి నుంచి శ్రీకేశవనాథ్‌స్వామి, ఆదిలాబాద్‌ నుంచి శ్రీ ఆదినాథ్‌స్వామి, వాల్గొండ చంద్రయ్యస్వామి, వేంపేట నుంచి భవవద్గీత పారా యణ భక్తులు, కొలిప్యాక నుంచి శ్రీగంగాధర్‌స్వామి, కోరుట్ల నుంచి శ్రీ ఆత్మనందస్వామి, గంభీర్‌పూర్‌ నుంచి గిరిజామాతస్వామి, కోరుట్ల నుంచి శ్రీజగదీశ్వరస్వామి, కోరుట్ల నుంచి హరిప్రియమాత, పిప్రి నుంచి శ్రీయోగేశ్వరస్వామి, శ్రీ నర్సింగరెడ్డిస్వామి లక్షదీపోత్సవానికి విచ్చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top