కోరికలను అదుపులో పెట్టుకోవాలి | Sakshi
Sakshi News home page

కోరికలను అదుపులో పెట్టుకోవాలి

Published Tue, Sep 2 2014 2:49 AM

To control cravings

  •      తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యతలు నేర్పించాలి
  •      మహా సహస్రావధాని గరికపాటి నర్సింహారావు
  • మహబూబాబాద్ టౌన్ : మనల్ని అభివృద్ధి చేసేది, నాశ నం చేసేది కోరికలేనని, ఆ కోరికలను ప్రతి ఒక్కరూ అదుపులో పెట్టుకోవాలని మహాసహస్రావధాని, అవధాన శార ద గరికపాటి నర్సింహారావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కామధేను గోశాల శ్రీ బం డ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో సోమవా రం రాత్రి ‘పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత’ అనే అంశం పై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి నర్సింహారావు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, నాగరికతను అంది పుచ్చుకోవడంలో ఇతర భాషల వారి కంటే భారతీయులు ముందంజలో ఉన్నారన్నారు.  

    ఇంగ్లీష్ వాఖ్యాలు వచ్చాక సంస్కృతి, ఆచారాలు, నాగరికత మారిపోయాయన్నారు. మార్పును మంచి కోసమే వినియోగించాలి తప్ప నాశనానికి వినియోగించవద్దన్నారు. తెలుగు విద్యా విధానం అమల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ అంటే ఏమిటో తెలియదన్నా రు. ఎల్‌కేజీ చదవాలంటే ప్రస్తుత రోజుల్లో మోతలు, లగేజీలు, ప్యాకే జీలు, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నారు. గతాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దని, కళలను ప్రోత్సహించాలన్నారు. నాటి రోజుల్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే పదాలు మొదటి పేజీల్లో ఉంటే నేడు ఏబీసీడీలు మొదటికి చేరుకుని తెలుగుపై పెత్తనం చేయాలని చూస్తున్నాయన్నారు.

    భాషపై ద్వేషం ఏమి లేదంటూ ఏబీసీడీలు కాదు, అ,ఆ,ఇ,ఈలు కూడా ముఖ్యమేనన్నారు. విద్యార్థుల ధర్మం చదువుకోవటమేనని తెల్పుతూ తల్లిదండ్రులు కూడా అందుకు తగ్గట్టుగా వారి అలవాట్లపై శ్రద్ధ కనపరచాలన్నారు. మనం ఏ పని చేస్తున్నామో దానిపైనే దృష్టి పెట్టాలని, అప్పుడే ఆ పనిపై విజయం సాధించగలుగుతామన్నారు.

    ఉపాధ్యాయులు పిల్లలకు మానసికోల్లాసాన్ని కల్గిస్తూ విద్యా భోదన చేయాలని తెలిపారు.  విద్యార్దులను భాగు చేసే అవకాశం వచ్చిందని అనుకోవాలన్నా రు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు గర్రెపెల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ భువనగిరి అనిల్‌గుప్త, ఇమ్మడి వెంకటేశ్వర్లు, భార్గవి, తమ్మి ఉపేందర్‌రావు, కొత్త సోమన్న, నాళ్ళ ప్రకా శ్, రాంకిషన్ ఝవర్, ప్రతాపని విశ్వనాధం, డాక్టర్ అశోక్, మహ్మ ద్ సుభాని, దైద వెంక న్న పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement