ఖానాపూర్ లో పెద్దపులి సంచారం | tiger Wandering in khanapur forest | Sakshi
Sakshi News home page

ఖానాపూర్ లో పెద్దపులి సంచారం

Nov 16 2015 2:28 PM | Updated on Sep 26 2018 5:59 PM

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి నిర్మల్ వైపు నుంచి ఓ కుటుంబం కారులో వస్తున్న సయమంలో పెద్దపులి కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం ఉదయం డీఎఫ్‌వో ప్రభాకర్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు ఇక్బాల్‌పూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగుజాడలు గుర్తించారు. గర్భంతో ఉన్న పెద్దపులి సంచరిస్తున్నట్టు తెలుసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement