పల్లె ప్రగతికి పట్టుగొమ్మ తిమ్మాపూర్ | Sakshi
Sakshi News home page

పల్లె ప్రగతికి పట్టుగొమ్మ తిమ్మాపూర్

Published Sun, Nov 23 2014 12:39 AM

three district selected to palle pragati  scheme

జగదేవ్‌పూర్: రాష్ర్టంలో పల్లె ప్రగతి పథకం ద్వారా పల్లెలో సకల సమస్యలు తీరనున్నట్లు, పల్లె ప్రగతికి మూడు జిల్లాలు ఎంపిక చేయడం జరిగిందని తెలంగాణ సెర్ఫ్ మానవాభివృద్ధి విభాగం డెరైక్టర్ మృదుల పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మెదక్ జిల్లాలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం ఎంపిక కావడంతో శనివారం ఆమె గ్రామాన్ని సందర్శించారు. ముందుగా ఆమె గ్రామంలోని మహిళ సంఘాల సభ్యులతో, అంగన్‌వాడి, పౌష్టిక ఆహార కేంద్రాల నిర్వాహకులు, గ్రామ సర్పం చ్‌తో సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ముఖ్య ఉద్దేశం పల్లెలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఒక గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి వంద శాతం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే జిల్లా తిమ్మాపూర్ గ్రామాన్ని ఎంపిక చేశారని చెప్పారు. గ్రామంలో సకల సమస్యలను తెలుసుకొని వాటిని ప రిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

మాతాశిశు మరణాలు తగ్గించడం, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురికి కాల్వలు నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, కలుషితం లేని తాగునీరు అందించడం, అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడం లాంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే పల్లె ప్రగతి లక్ష్యమన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాడకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే టాటా కంపెనీ ఆధ్వర్యంలో త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 45 రోజుల్లో తిమ్మాపూర్ గ్రామంలో మార్పు వస్తుందన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

 గ్రామంలో 3 సీఆర్‌పీలను నియమించి మరుగుదొడ్ల వాడకంపై రోజువారి సర్వేను చేపడతామని తెలిపారు. జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ కలపతో కట్టుకున్న పాతకాలం ఇళ్లు, చెట్ల పెంపకం స్థలాన్ని అక్కడ నీటి వసతిని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమా, యంగ్ ప్రొఫెషనల్ శివా, హెచ్.డి ప్రేరణ, మండల ఎపిఎం యాదగిరి, క్లస్టర్ ఎపిఎం దుర్గయ్య, సిసి స్వామి, గ్రామ మహిళ సంఘం అధ్యక్షులు లక్ష్మి, విఓఎ నందిని, హెచ్‌ఎ పూజరాణి, టీఆర్‌ఎస్ నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement