రైతన్నా.. జరపదిలం | Sakshi
Sakshi News home page

రైతన్నా.. జరపదిలం

Published Wed, Sep 24 2014 1:36 AM

threat posed to the along form

ఆదిలాబాద్ అగ్రికల్చర్  :  పొలం గట్లపై.. చేలలో పాముల సంచారం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు జరభ్రదంగా ఉండాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ పేర్కొంటున్నారు. చేలలో పచ్చని గడ్డి పెరిగి అందులో విషసర్పాలు సంచరిస్తుంటాయి. చేలలో పనిచేస్తుండగా పాముకాటు బారిన పడి ఏటా కొందరు రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

రాత్రివేళ చేను కావలికి వెళ్లి చీకట్లో గడ్డిలోంచి నడుస్తుండగా పాము కాటేస్తున్నాయి. పగటి వేళ సైతం చేను పనుల్లో బిజీగా ఉండగా పాము సమీపంలోకి వచ్చినా గమనించకపోవడంతో వాటి కాటుకు గురైన సందర్భాలూ ఉన్నాయి. అయితే చిన్నపాటి జాగ్రత్తలు, స్వీయరక్షణ చర్యలు పాటిస్తే పాముల బెడద నుంచి బయటపడొచ్చని శాస్త్రవేత్త రాజశేఖర్ సూచిస్తున్నారు.

 జాగ్రత్తలు
 రాత్రివేళ పొలం వద్దకు వెళ్లే రైతులు టార్చిలైట్లు, కర్ర, సెల్‌ఫోన్ వెంట తీసుకెళ్లాలి. శబ్ధం చేస్తూ నడవాలి.
 రాత్రి చేలకు వెళ్లే రైతులు బూట్లు వేసుకోవడం మంచిది.  
 జిల్లాలో వివిధ రకాల పాములు ఉండగా నాగుపాము, కట్ల పాము, రక్త పింజర వంటి వాటిలోనే అధిక విషం ఉంటుంది. మిగతావి చా లా వరకు విషరహితాలే. పాము కాటేయగానే భయపడకుండా వెం టనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. లేదా సమీపం లో ఉన్న రైతులకు విషయం చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరాలి.
 పాటు కాటేస్తే.. వెంటనే కాటేసిన చోటుకి కొంచెం పైభాగంలో దారంతో కట్టుకట్టి రక్త ప్రసరణ పైకి జరగకుండా చూడాలి.
 కాటేసిన ప్రాంతాన్ని కదపకుండా, కుదుపులకు గురికాకుండా చూడాలి. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి.
 ఇంట్లోని ఫ్రిజ్‌లో లేదా బయట ఐస్‌ముక్కలు దొరికితే తీసుకురావాలని సూచించాలి.  
 ఐస్ ముక్కలు ఉన్నట్లయితే కాటేసిన చోటును, ఆ అవయవాన్ని మంచు ముక్కలతో చుట్టి వస్త్రంతో కట్టేయాలి. దీంతో రక్త ప్రసరణ నెమ్మదిగా జరిగి విష ప్రభావం గుండెకు, ఊపిరితిత్తులకు చేరడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఆస్పత్రికి వెళ్లే వరకు ఇది కాపాడుతుంది.
కాటేసిన ప్రాంతం నుంచి వీలైనంత రక్తాన్ని పిండేయాలి.
 సాధారణంగా పాములు కాళ్లు, చేతులకే కాటేస్తాయి. ఇలా జరిగితే కాటేసిన చేయి, కాలును పెకైత్తకుండా వీలైనంత కిందికి అంటే విషరక్తం గుండెకు సులువుగా చేరకుండా కదలనీయకుండా కిందికి పట్టి ఉంచాలి.
 మంత్రాలు, చెట్లు, పసరు తదితర మందులంటూ కాలయాపన చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
 మనిషిని కాటు వేసే ముందు పాము ఇతర జంతువును కాటేస్తే మనిషికి అంతగా అపాయం ఉండదు. పాము కాటుకు గురైన వ్యక్తి ధైర్యంగా ఉండాలి. చుట్టు ఉన్నవారూ ధైర్యం చెప్పాలి.
 జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు నివారణ మందులు అందుబాటులో ఉన్నందున బాధితుడిని సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

 పాములను గుర్తించడమిలా..
 నాగు పాము : సాధారణంగా ముదురు గోధుమ వర్ణంలో ఉండి పడగ కలిగి ఉంటుంది.
 కట్ల పాము : నలుపు రంగులో ఉండి ఒంటిపై నలుపు, తెలుపు చారలు కలిగి ఉంటుంది.
 రక్త పింజర : గోధమ రంగులో ఉండి శరీరంపై, వీపు భాగంలో డైమండ్ ఆకారపు గుర్తులు మూడు వరుసల్లో ఉంటాయి. అలాగే తలపై బాణపు గుర్తు ఉంటుంది.

 విషప్రభావం
 పాము కాటేసిన ప్రదేశంలో రెండు లేదా నాలుగు కామ ఆకారపు గుర్తులు పడతాయి. అరగంటలోపే విషం ఒళ్లంతా పాకి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కళ్లు మూత పడడం, కాళ్లూచేతులు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాము విషాన్ని న్యూరో టాక్సిన్ అంటారు.

 రక్త పింజర కరిచిన భాగం ఉబ్బి తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. అరగంటలో నోట్లోంచి, చెవుల్లోంచి రక్త స్రావం జరుగుతుంది. ఆ విషాన్ని హీమో టాక్సిన్ అంటారు.
 
ఆస్పత్రి దూరంగా ఉంటే..
 ఆస్పత్రి చాలా దూరంలో ఉంటే వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. పాము కరిచిన భాగాన్ని బట్టతో లేదా టవాల్‌తో గట్టిగా కట్టాలి. ఇలా చేయడం వల్ల విషం తొందరగా శరీరంలోకి వ్యాపించదు. కట్టును పది నిమిషాలకు ఒకసారి వదిలి కడుతూ ఉండాలి.

 కొత్త బ్లేడుతో పాము కరిచిన స్థానంలో ప్లస్‌గుర్తులా ఒక సెంటిమీటర్ లోపలికి కోయాలి. కాసేపటికి విషంతో కూడిన రక్తం దానంతట అదే బయటకు పోతుంది. వైద్యుడితో యాంటీ స్నేక్ వీనమ్(ఏఎస్‌వీ) తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు.

Advertisement
 
Advertisement
 
Advertisement