నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని జలాశయం వద్ద ఉన్న మూడు ఆలయాల్లో చోరీలు జరిగాయి.
శాలిగౌరారం(నల్లగొండ): నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని జలాశయం వద్ద ఉన్న మూడు ఆలయాల్లో చోరీలు జరిగాయి. దుండగులు దర్జాగా కారులో వచ్చి, పని ముగించుకుని వెళ్లారు. వివరాలివీ...ప్రాజెక్టు వద్ద శ్రీసీతారామచంద్రస్వామి, గౌరమ్మ, గంగ దేవమ్మ ఆలయాలున్నాయి. గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళంవేసి ఉన్న దేవాలయాల ప్రధాన ద్వారాల బేడాలను విరగ్గొట్టి చోరీకి పాల్పడ్డారు.
శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం ప్రధాన ద్వారానికి ఉన్న ఇనుప గ్రిల్స్ బేడాన్ని విరగగొట్టారు. విగ్రహానికి ఉన్న వెండి కళ్ళు, మీసాలు, కిరీటంలతో పాటు ఆభరణాలను దొంగిలించారు. సొత్తు విలువ రూ.30 వేలుంటుందని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, గౌరమ్మ, గంగ దేవమ్మ ఆలయాల్లో విగ్రహాల కళ్లు, కిరీటాలు, ఇతర ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ సొత్తు విలువ రూ.20 వేలుంటుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, ఈ గుడుల వద్దకు కారు వచ్చిన ఆనవాళ్లున్నాయి.