గజ్వేల్‌రూరల్: ఏపీ సీఎం చంద్రబాబుది దొంగబుద్ధని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖమంత్రి పద్మారావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
గజ్వేల్‌రూరల్: ఏపీ సీఎం చంద్రబాబుది దొంగబుద్ధని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖమంత్రి పద్మారావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత మామకే వెన్నుపోటు పోడిచిన ఘనుడు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడం కోసం అడ్డదారిలో వెళ్లి అడ్డంగా బుక్కయ్యారన్నారు. తెలంగాణలో అస్థిరతను సృష్టించడానికి బాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రాలో కూడా టీడీపీ ఉనికి కోల్పొయే పరిస్థితి నెలకొందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ చంద్రబాబు తెలంగాణలో తన ఆధిపత్యం చెలాయించాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైన బాబు వైఖరి మార్చుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధిచెప్తారన్నారు. ఆయన వెంట నగరపంచాయతీ చైర్మన్‌భాస్కర్, కౌన్సిలర్ సుభాష్‌చంద్రబోస్, రాందాస్, నర్సింలు, టీఆర్‌ఎస్ నాయకులు నంగునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.