కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన చెన్నవేని చిన్నగంగారాం(65) అనే రైతు అప్పులబాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన చెన్నవేని చిన్నగంగారాం(65) అనే రైతు అప్పులబాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నగంగారాంకు మూడెకరాల భూమి ఉంది. బోర్లు వేయగా చుక్కనీరు రాలేదు. తిండికోసమని రెండు గుంటల్లో వరి వేయగా ఎండిపోయింది. ఆయన కుటుంబానికి రూ.2 లక్షల అప్పు ఉంది. ఓ వైపు వృద్ధాప్యం మీద పడడం... అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో శుక్రవారం చేను వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు.