
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ కేసు నిందితులకు సరైన శిక్ష పడిందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని, సత్వర న్యాయం చేశారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఇటువంటి శిక్షలే సరి అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందని భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దారుణాలకు పాల్పడే వారికి వెంటనే శిక్షలు పడేలా చట్టాలను మరింత కఠినంగా మార్చాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
(చదవండి: ఎన్‌కౌంటర్: గుడిగండ్లలో ఉద్రిక్తత)