
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం తరఫున 2,96,97,279 మంది ఓటర్లు ఓటేయనున్నారు. ఇందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు ఉన్నారు. 18–19 ఏళ్ల వయసున్న 6,52,744 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కు పొందగా, అందులో 3,65,548 మంది పురుషులు, 2,87,103 మంది మహిళలు, 93 మంది ఇతరులున్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోమవారం అనుబంధ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి 22న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో 2,95,18,954 మంది ఓటర్లున్నారు. నిరంతర ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 వరకు 3.38 లక్షల మంది కొత్త వారు ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరించి సోమవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించగా, 1,78,325 మంది కొత్త ఓటర్లకు చోటు లభించింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే ఓటర్ల సంఖ్య 2,96,97,279కు పెరిగింది.
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 41,77,703 మంది, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 2,47,419 మంది ఓటర్లున్నారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 6,17,169 మంది, భద్రాచలం అసెంబ్లీ స్థానంలో అత్యల్పంగా 1,45,509 మంది ఓటర్లున్నారు.
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 31,49,710 మంది, అత్యల్పంగా మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో 14,23,351 మంది ఓటర్లున్నారు.
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా..